నవభారత్ న్యూస్ ప్రతినిధి మోజెష్............
భారతీయ జనతా పార్టీ విజయం పట్ల భాజాపాశ్రేణుల హర్షం..........
ఇటీవల జరిగిన మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం పట్ల భారతీయజనతా పార్టీ కందుకూరు శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయ్ లు పంచుకున్నారు. ఈసందర్భంగాఅసెంబ్లీకన్వినర్ఘట్టమనేని హరిబాబు మాట్లాడు తు రానున్న 10సంవత్సరాలకాలంలో ఈ దేశాన్ని పాలించే శక్తి బా జ పా కు దేశప్రజలు అందిస్తారని ఆ శాభావం వ్యక్తం చేశారు. ఈ విజయానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జొన్నాదుల రాఘవయ్య పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి చుండి మురళీధర్ ఉపాధ్యక్షులు బొర్రా కోటేశ్వరరావు అమలనాధుని మాల్యాద్రినాయుడు కోశాధికారి చిన్ని పాండురంగయ్య సీనియర్ నాయకులు మువ్వల భూషయ్య పాలూరు మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.