ఎమ్మెల్యే ఇంటూరి ఆదేశాల మేరకు రోడ్డులోనికి పెరిగిన పిచ్చిమొక్కలను,చిల్లకంపను తొలగించే కార్యక్రమంను పరిశీలిస్తున్న ఎంపిడివో వై.వెంకటేశ్వరరావు.

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్.......

ఎమ్మెల్యే ఇంటూరి ఆదేశాల మేరకు రోడ్డులోనికి పెరిగిన పిచ్చిమొక్కలను,చిల్లకంపను తొలగించే కార్యక్రమంను పరిశీలిస్తున్న ఎంపిడివో వై.వెంకటేశ్వరరావు.

----- మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న పంచాయతీ రక్షిత మంచి నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాన్కు లను శుభ్రపరచడం.


---అవసరమైన గ్రామాల్లో క్లోరినేషన్ ప్రక్రియ.


---ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు చేపట్టిన కార్యక్రమం.

గుడ్లూరు నవంబర్-24(నవభారత్ న్యూస్ గుడ్లూరు ప్రతినిధి సి.హెచ్. ఆంజనేయులు) 

         గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు గుడ్లూరు మండలంలోని అన్నీ గ్రామపంచాయతీలలో రహదారులకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు మరియు కంప చెట్లు పెరిగి బాటసారులకు, వాహనదారులకు మరియు బస్సు ప్రయాణానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని గుర్తించి స్థానిక గ్రామపంచాయతీలో ఉన్న నిధుల లభ్యతను బట్టి జంగిల్ క్లియరెన్స్ చేయించవలసినదిగా సూచించినందున ఆదివారం గుడ్లూరు గ్రామంలోని సినిమా హాల్ సెంటర్ వద్ద నుండి చెమిడితిపాడు డొంక రోడ్డు వరకు ఉన్న జంగిల్ ను గుడ్లూరు గ్రామ సర్పంచ్ శంకర్ ఆధ్వర్యంలో తొలగించడం జరిగింది. అదేవిధంగా మండలంలోని అన్ని వాటర్ ట్యాంకులు శుభ్రం చేయించడంతోపాటుగా, మండలంలోని ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించాలని గౌరవ శాసనసభ్యుల వారు సూచించడం జరిగింది. అందులో భాగంగా ఆదివారం గుడ్లూరు గ్రామంలోని గుడ్లూరు -1గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకును శుభ్రం చేయించడం జరిగింది. అదేవిధంగా క్లోరినేషన్ కూడా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడ్లూరు ఎంపీడీవో వై. వెంకటేశ్వరరావు పాల్గొని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సీజనల్ వ్యాధులు , అంటువ్యాధులు, త్రాగునీటి ద్వారా ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్యశాఖ వారిచే అన్ని గ్రామ పంచాయతీలకు సరఫరా చేయబడిన క్లోరిన్ టాబ్లెట్లను వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సహాయంతో ఇంటింటికి పంపిణీ చేయబడుతున్నందున గృహస్తులు అందరూ వారు త్రాగే నీటిలో నిండు బిందెలో ఒక క్లోరిన్ టాబ్లెట్ ను వేసుకొని కుటుంబంలోని వారందరూ ఉపయోగించినందువలన త్రాగునీటి ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టవచ్చునని అదేవిధంగా గుడ్లూరు గ్రామ పరిధిలో గత రెండు రోజుల క్రితం ఫాగింగ్ చేయడం ద్వారా దోమల నిర్మూలనకు చర్యలు చేపట్టినట్లు తిరిగి నాలుగు రోజుల తర్వాత మరలా ఫాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామంలో దోమల బెడదని నివారించడానికి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని అని గుడ్లూరు గ్రామ సర్పంచ్ శంకర్ ,ఎంపిడిఓ వై.వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేసారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top