పెట్రోల్ బంక్ నిర్మాణం వద్దు.. నియోజకవర్గఅభివృద్ధి మండలి ఆక్షేపణ

NavaBharath News Kandukur
0


 నవభారత్ న్యూస్......


పెట్రోల్ బంక్ నిర్మాణం వద్దు.. నియోజకవర్గఅభివృద్ధి మండలి ఆక్షేపణ

నవభారత్ న్యూస్ ప్రతినిధి మోజెష్....

 రెవెన్యూ ఆఫీస్ ప్రాంగణంలో పెట్రోల్ బంకు నిర్మాణం చేయాలని పలువురు చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే విరమించు కోవాలని డిమాండ్ చేస్తూ కందుకూరు నియోజక వర్గం అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో గురువారం మండల తహసీల్దార్ ను కలిసి వినతిపత్రంను అందజేశారు. పెట్రోల్ బంకును దాదాపు పదికి పైగా ప్రభుత్వ ఆఫీసులు ఉన్న ప్రాంగణంలో నిర్మించాలని తీవ్ర ప్రయత్నం చేయటం సరైనది కాదన్నారు. ప్రభుత్వ అధికారులు చెబుతున్నట్లు రెవెన్యూ పరిధిలోని ఈ బంకును నిర్మించాలని అనటం ఆక్షేపనీయమని కందుకూరు నియోజక వర్గ అభివృద్ది కమిటీ సభ్యులు తోకల వెంకటేశ్వర్లు, పులిచర్ల. సుబ్బారెడ్డి, ముప్పవరపు కిషోర్ తదితరులు పేర్కొన్నారు. పెట్రోల్ బంకు నిర్మాణం వలన ప్రభుత్వ ఆఫీసుల కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. అదేవిధంగా శతాబ్దాల చరిత్ర కలిగిన చెట్లను నరకడం వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని ఏర్పడుతుంది. ముఖ్యంగా నిత్యం రద్దీ ట్రాఫిక్ ఉన్న ఓవీ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పెట్రోల్ బంకు నిర్మాణం చేయటం వలన చుట్టూ ప్రభుత్వ ఆఫీసులకు గాని నివాస ప్రాంతాలకు గాని దగ్గరలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గాని రక్షణ ఉండదు. నిత్యం ట్రాఫిక్ వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడి పాదాచారులకు సురక్షితము లేకుండా పోతుందని, రోడ్డు సైడ్ ఉన్న చిరు వ్యాపారుల జీవనోపాధి కోల్పోతారని అభివృద్ధి మండలి ఆక్షేపిస్తుంది. తహసీల్దార్ స్పందిస్తూ గతంలోనే పెట్రోల్ బంకునకు నిర్మాణమునకు అన్ని అనుమతులు రెవెన్యూ అధికారులు మంజూరు చేసి ఉన్నదని చెప్పారు.ఈ బంక్ నిర్మాణం రెవెన్యూ భూమి పరిధి లోనే నిర్మాణం చేయవలసి ఉంటుందని తెలిపారు.అభివృద్ధి మండలి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాము. ఈ పెట్రోల్ బంకు నిర్మాణాన్ని నిరసిస్తున్నామని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరైన చర్యలు తీసుకొని రెవెన్యూ ప్రాంతంలో మరొకచోట ప్రజలకు ఇబ్బంది లేని ఎక్కడైన పెట్రోల్ బంకు నిర్మాణం చేసుకొనుటకు అభివృద్ధి కమిటీకి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి మండలి సభ్యులు తోకల వెంకటేశ్వర్లు, పులిచెర్ల వెంకట సుబ్బారెడ్డి, అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్, చింతరబోయిన నరేష్, సిహెచ్ గోపాల్,రేణమాల అయ్యన్న, డి ఆదిలక్ష్మి, టి కృష్ణారావు, జె. నరసింహ, యు మాధవరావు, ఎం శ్రీను, ఎస్ కె ఖుద్ధీస్, ఎస్డి రబ్బాని, ఎస్కే రహమతుల్లా, బి నాగరాజు, ఎస్కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top