నవభారత్ న్యూస్.....
M. L. C. ప్రొఫెసర్ కోదండరాం సార్ గారి జన్మదిన వేడుకలు విద్యార్థుల మధ్యలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసిన డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్
ఈరోజు మంచిర్యాల జిల్లా భీమారం మండలం కాజిపల్లి గ్రామంలో విద్యార్థుల మధ్యలో ఘనంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సార్ గారి జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ ఉద్యమ సారధి తెలంగాణ జాతిపిత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సార్ గారి జన్మదిన వేడుకలు కాజిపల్లి గ్రామంలో ని స్కూల్లో విద్యార్థుల మధ్యలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది అనంతరం స్కూల్ పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు ,పెన్సిళ్లు ,పలకలు ,వాటర్ బాటిల్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు దాడి తిరుపతి యాదవ్, సముద్రాల శ్రీనివాస్, కొమ్ము సురేందర్ యాదవ్, దాడి భాస్కర్, రాజు బాబు యాదవ్, లింగం రాజేష్ ,దొంగిరి మధుకర్, దేవ మల్లేష్ యూత్ నాయకులు దేవ మనోహర్ అడువాల శ్యామ్ అమర గాని ఉమేష్ యాదవ్ రస ప్రసాద్ మరియు విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు.