నవభారత్ న్యూస్... కందుకూరు
తెలుగుదేశం గూటికి చాకిచెర్ల సర్పంచ్*
✍️ వైసీపీ మద్దతుతో గెలిచిన, ఉలవపాడు మండలం చాకిచెర్ల పంచాయతీ సర్పంచ్ వీరమల్లు విజయమ్మ సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు.
✍️ కందుకూరు శాసనసభ్యులు శ్రీ *ఇంటూరి నాగేశ్వరరావు* గారి సమక్షంలో పార్టీలో చేరగా, ఎమ్మెల్యే గారు సాదరంగా ఆహ్వానించారు.
✍️ సర్పంచ్ తో పాటు 10 వ వార్డు సభ్యుడు ప్రళయకావేరి అంకయ్య, వైసీపీ నేత తోట వెంకటనారాయణ తదితరులు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారిపై నమ్మకం, ఆయన కల్పిస్తున్న భరోసాతో టిడిపిలో చేరుతున్నామని సర్పంచ్ తెలిపారు. వైసీపీ పాలనలో పంచాయతీలో చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేకపోయామని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నిర్ణయాలతో పంచాయతీల్లో మళ్లీ వెలుగులు నిండుతున్నాయని అన్నారు.
✍️ ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరినవారు, ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారిని శాలువాతో సత్కరించారు.
✍️ గ్రామ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సర్పంచ్ కు హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
✍️ కార్యక్రమంలో చాకిచెర్ల గ్రామ టిడిపి అధ్యక్షుడు మిరియం మల్లికార్జున, ఇతర నాయకులు పాల్గొన్నారు.