నవభారత్ న్యూస్ గుడ్లూరు .రూరల్. ప్రతినిధి సిహెచ్. ఆంజనేయులు . ప్రభుత్వాలు మారిన తీరని ప్రజల దాహం తీరేదెలా. పాత రోజులే. గుర్తొస్తున్నాయి. అంటున్న గుడ్లూరు గ్రామ ప్రజలు.
గ్రామీణ పరిసరాలలో భూగర్భ జలాలు ఉప్పు చవ్వలు కావటంతో గ్రామంలో మరి కొన్ని చేతిపంపులు ఉన్నా కూడా వాటిలో వచ్చే నీటితో గొంతు తడుపుకొని దప్పిక తీర్చుకునేందుకు పనికి రాకపోవడంతో ప్రజలు ప్రైవేటు వాటర్ ప్లాంట్లపై ఆధారపడవలసి వస్తుంది రుచి కోసం వారి కరిపే రసాయనాల వల్ల కీళ్ల నొప్పులు వస్తున్నాయి అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో సహజ సిద్ధమైన మంచినీటి కోసం వెతుక్కుంటున్న తరుణంలో ఊరి చిబార్లో విష్ణాలయం వీధి బజారులో ఒకే ఒక్క చేతిపపు మాత్రమే మంచినీరు లభిస్తుంది . ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వారు ఒక కిలోమీటరు దూరoలో.ఉన్న. అక్కడకు వెళ్లి మంచి నీటిని తెచ్చుకోవడం జరుగుతుంది మండల అధికారులు పంచాయతీ సర్పంచ్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మంచినీళ్లు పడే ప్రదేశాలలో మరో చేతిపంపును ఏర్పాటు చేస్తే గ్రామస్తులకు మంచినీటి సమస్య తీరుతుంది అని గ్రామస్తులు కోరుకోవడం జరుగుతుంది మంచినీటి కష్టాలు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న తీరుపై గ్రామ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు కాస్త దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
K