విజయవాడ వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధికి
మాగుంట కోటి యాభై లక్షలు...... విరాళం....
విజయవాడ నవభారత్ న్యూస్ ::: వరద బాధితుల సహార్ధం ఈ రోజు అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రకాశం జిల్లా శింగరాయకొండ లోని పెరల్ డిస్టిల్లరీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కు రూపేణా కోటి యాబై లక్షలు రూపాయల విరాళాన్ని ఈ రోజు విజయవాడలో కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలసి ఒంగోలు పార్లమెంటు సభ్యులు. గౌ. శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు మరియు మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ శ్రీ మాగుంట సుబ్బరామ రెడ్డిగారి అల్లుడు, శ్రీ ఆనం శివకుమార్ రెడ్డి గారు అందజేశారు.