గుడ్లూరు మండల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం ."

NavaBharath News Kandukur
0

 



నవభారత్ న్యూస్.......

" గుడ్లూరు మండల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం ."

గుడ్లూరు సెప్టెంబర్-05(నవభారత్ న్యూస్ గుడ్లూరు రూరల్ ) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గుడ్లూరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో పనిచేయుచున్న ఐదుగురు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి వారికి సత్కారం నిర్వహించారు. వారిలో శ్రీయుత పంకమాల కొండయ్య (ఎంపియుపిఎస్ తెట్టు)శ్రీమతి కోలా విజయమ్మ (ఎంపీ యుపిఎస్ పోట్లూరు) శ్రీయుత కేసరపల్లి శ్రీహర్రావు (ఎంపీపీ ఎస్ చేవూరు) శ్రీయుత జే .జీవన్ జ్యోతి (ఎంపీపీఎస్ మోచర్ల ఎస్సీ) శ్రీమతి ఎం. శేషమ్మ (ఎంపీపీ ఎస్ పరకంపాడు) అను వారలకు దుశ్యాలువ పూలమాలలతో పాటు ప్రశంసాపత్రాన్ని అందించి మండలంలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతల సేవలను ఉపాధ్యాయులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎం. గోవర్ధన్ మండల అభివృద్ధి అధికారి ఎన్ .రాజశేఖర్, జడ్పిహెచ్ఎస్ బసి రెడ్డి పాలెం ప్రధానోపాధ్యాయులు కే. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top