భక్తులు వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలి."....

NavaBharath News Kandukur
0

 



 నవభారత్ న్యూస్... గుడ్లూరు....

" భక్తులు వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలి."


---గుడ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మంగారావు.

గుడ్లూరు నవభారత్ న్యూస్ సెప్టెంబర్ -05::  ఎస్పీ ఎస్సార్ నెల్లూరు జిల్లా గుడ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లోని వినాయక స్వామి భక్తులందరికి ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు గుడ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మంగారావు. బుధవారం గుడ్లూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్.పి.ఉత్తర్వుల మేరకు గ్రామాల్లో గణేష్ మండపాల ఏర్పాటుకు ,విగ్రహాల ప్రతిష్టకు భక్తులు తీసుకోవాల్సిన అనుమతులు ,పాటించాల్సిన నియమాలను ,అనుసరించాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు.

ముఖ్యంగా గణేష్ భక్త బృందాలు సంయమనంతో ఉండాలి అని ,భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ,ఎలాంటి అల్లర్లు ,అగ్నిప్రమాదములు జరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీసుల నిబంధనలకు లోబడి భక్తులందరూ పోలీసులకు సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని తెలియజేసారు.

వినాయక విగ్రహాల ఏర్పాటుకు ,మండపాల వద్ద కమిటీ మెంబర్లకు కొన్ని బాధ్యతలుపాటించాలని తెలిపారు. 

గణేష్ మండపాల ఏర్పాటు ,విగ్రహాలు ప్రతిష్టకు ప్రతి ఒక్కరు http://ganesh usab.net అను వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొంటే పోలీసు శాఖతో పాటు అన్ని విభాగాల అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారని గుడ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మంగారావు తెలిపారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top