నవభారత్ న్యూస్...... కందుకూరు.....
వరద బాధితులను ఆదుకోవాలని వైసీపీ శ్రేణులకు పిలుపు ..వైఎస్ఆర్సిపి కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి, బుర్రా మధుసూదన్ యాదవ్.....
వరద బాధితులకు సహాయం అందించిన వైసిపి ప్రజాప్రతినిధులను బుర్రా మధుసూదన్ యాదవ్ అభినందించారు.వరదలలో చిక్కుకుని తిండి నీరు లేక అల్లాడుతూ, వరద ముంపులో చిక్కుకొని ఉన్న విజయవాడ ప్రజలను ఆదుకొనుటకు జరిగే సహాయ సహకారాలలో వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు, స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొనాలని తెలియజేశారు. వైసిపి అధినేత పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వరద బాధితులను ఆదుకునే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసినదే. కందుకూరు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయాన్ని అందించడం అభినందించదగ్గ విషయమని ఆయన అన్నారు. వరద ప్రాంతంలో చిక్కుకున్న ప్రజలను మానవతా దృక్పథం తోటి అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.