జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలకు సత్కారం."

NavaBharath News Kandukur
0

 




నవభారత్ న్యూస్......

" జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలకు సత్కారం."

గుడ్లూరు సెప్టెంబర్-05(నవభారత్ న్యూస్ గుడ్లూరు ) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంను నెల్లూరు నందు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం పలువురు ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రకటించింది .వాటిలో ఈ సంవత్సరం గుడ్లూరు మండలంనకు చెందిన నలుగురు ఉపాధ్యాయులకు దక్కడం విశేషం. ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , జిల్లా విద్యాశాఖ అధికారి పి.వి.జే. రామారావు ఉపాధ్యాయులను దృశ్యాలువా జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రంలతో ఘనంగా సత్కరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు పొందిన ఉపాధ్యాయుల వివరాలు శ్రీయుత ఎం. జనార్ధన్, (జడ్పిహెచ్ఎస్ బసిరెడ్డి పాలెం) ఎస్. ప్రసన్న కుమారి (ఎంపీపీ ఎస్ గుండ్లపాలెం )పి .మనోహరం (ఎంపీపీ ఎస్ కొత్తపేట )ఏ. ఏ .పి .ఎన్. రమాదేవి (ఎంపీపీఎస్ పోట్లూరు ఎస్టి) తదితరులకు పురస్కారాలు అందించారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top