నవభారత్ న్యూస్...... కందుకూరు.
7వ తేదీన శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయపున: నిర్మాణ ప్రథమ వార్షికోత్సవం
కందుకూరు పట్టణం లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ ప్రథమ వార్షికోత్సవం ఈనెల 7వ తేదీ శనివారం జరుగుతున్న సందర్భంగావివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కృష్ణవేణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు అమ్మవారికి అభిషేకం అనంతరం ప్రత్యేక అలంకరణ ఉంటుందన్నారు. సాయంత్రం 8 గంటలకు భక్తజన సందోహం మధ్య అమ్మవారికి పల్లకిసేవ జరుగుతుందని తెలిపారు.
కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రధమ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై అంకమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని కృష్ణవేణి చెప్పారు. యావన్మంది భక్తులు అంకమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.