నవభారత్ న్యూస్.. కందుకూరు ....
వరద బాధితులకి 50,000 ఆర్థిక సహాయం చేసిన మస్త
కందుకూరు....
ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు విజయవాడ ప్రాంతం వరదలతో రోడ్డున పడ్డ పేద ప్రజలను ఆదుకోవాలని స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావుకి కందుకూరు పట్టణంలోని శ్రీరాంనగర్ 14 వ వార్డుకు చెందిన తల తోటి మస్తాన్ 50 వేల రూపాయల చెక్కుని అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ వరద బాధితులకు సహృదయంతో ఆర్థిక సహాయం అందించిన తల తోటి మస్తాన్ను అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోట పూరి శ్రీను, గుమ్మడి మాల్యాద్రి, బూసి మాల్యాద్రి, ఏల్చూరి మాల్యాద్రి, సాదు మహేష్ తదితరులు పాల్గొన్నారు.