వైసిపి పార్టీని విలీనం చేస్తామంటే స్వాగతిస్తాం : షర్మిల.
వైసిపి పార్టీని తమ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనని జోస్యం అని చెప్పారు. ఒకవేళ వారు కలుస్తామని అంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. వైసిపి చీఫ్ తో కాంగ్రెస్ చర్చలు జరిపిందనే ప్రచారం అబద్దం అన్నారు.
జగన్ తిరిగి అధికారంలోకి రారని షర్మిల అన్నారు. విశాఖ ఎమ్మెల్సీ సీటుతో పండుగ చేసుకోమని సెటైర్ వేశారు.