నవభారత్ న్యూస్ బోగోలు.
బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే.
బోగోలు మండలం ముంగమూరు గ్రామంలో శ్రీ పోతురాజు సహితశ్రీ పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం సందర్భంగా ఒంగోలు జాతి రాష్ట్రస్థాయి ఎద్దుల ప్రదర్శన, బండలాగుడు పోటీలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గు మాటి వెంకట కృష్ణారెడ్డి గారు విచ్చేసి పోటీలను ప్రారంభించారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు, పోటీల నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు... ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం నేటి తరానికి తెలియ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎమ్మెల్యే గారు అన్నారు..