నవభారత్ న్యూస్ సింగరాయకొండ..
పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని సింగరాయకొండ లో ప్రైవేట్ ఫైనాన్స్ ఏజెంట్లు పెట్రేగిపోతున్నారు. హోమ్ లోన్ పేరుతో పేదలకు ఆశ చూపి తక్కువ వడ్డీలు చెల్లించి లోన్లు పొందే అవకాశం ఉందని ప్రైవేట్ ఫైనాన్స్ ఏజెంట్లు పేదలను జలగల్లా పీడిస్తూ చట్టాన్ని అవహేళన చేస్తున్నారు. భూమికి సంబంధించి రెవెన్యూ అధికారుల నుండి అవసరమైన పొజిషన్ సర్టిఫికేట్, గిఫ్ట్ డీడ్,డాక్యుమెంట్ రైటర్లకుచెల్లించాలని పేదల వద్ద అధిక మొత్తంలో ప్రైవేటు ఫైనాన్స్ ఏజెంట్లు పేదల రక్తం పిలుస్తున్నారు అన్న విమర్శలు వినవస్తున్నాయి. ఏ భూమికి,ఎవరి భూమికి ఏజెంట్లు తగిన పత్రాలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు అగమ్య గోచరంగా ఉంది.పెద్దలు ఆందోళన చెందుతున్నారు. సింగరాయకొండ లో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఏజెంట్లు మోసాల నుండి కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.