కందుకూరు పట్టణంలోని వాసవి క్లబ్ లెజెండ్స్ మరియు వనిత క్లబ్ ల ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలో కొవ్వూరు రోడ్డులోని స్వర్ణ స్వయంకృషి మనసిక దివ్యాంగుల స్కూలులో కందుకూరు వాసవి క్లబ్ లెజెండ్స్ ప్రెసిడెంట్ రవ్వ శ్రీనివాసులు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్కూల్ కి క రెస్పాండెంట్ సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ కందుకూరు వాసవి క్లబ్స్ వారు మరియు వారి సభ్యుల సహకారంతో మా స్కూల్ కి సహాయ సహకారం అందిస్తున్నారని వారికి ధన్యవాదములు తెలిపారు మంచి కార్యక్రమాలు ఎప్పుడూ కొనసాగుతూ ఉండాలని అన్నారు. మరియు పి ఎస్ ఆర్. కందుకూరు వారి సహకారంతో స్వర్ణ స్వయంకృషి మానసిక వికలాంగుల ఆశ్రమంలో పిల్లలకు పలకల పంపిణీ మరియు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ లెజెండ్స్ ప్రెసిడెంట్ సేవా హృదయ రవ్వ శ్రీనివాసులు, సెక్రటరీ ఇన్నమూరి శ్రీనివాసులు,ట్రెజరర్ చీదెళ్ల కృష్ణ, వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ కస్తూరి నటరాజకుమారి, సెక్రటరీ నారాయణ సుకన్య,R. C.. A. గుర్రం మంజుల కుమారి,జ్. Z.. C. కోట వెంకటేశ్వర్లు, గుర్రం అల్లూరయ్య, కోట నరసింహం, కొనిజేటి విజయకుమార్ మరియు పి ఎస్ ఆర్ ఫోర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.