నవభారత్ ఆంధ్ర ప్రదేశ్
ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి. ఆరోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయితీలకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. పంచాయితీల్లో ఆగస్టు 15న వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నాము. ఇప్పటివరకు మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయితీలకు రు.250 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ. 25 వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా ఆధారంగా 5 వేలు లోపు జనాభా ఉన్న పంచాయితీలకు రూ 10 వేలు, 5 వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 25 వేలు అందిస్తాం అని పవన్ కళ్యాణ్ వివరించారు