నవభారత్ న్యూస్ గుడ్లూరు.
గ్రంథాలయ పితామహుడు ఎస్ ఆర్ రంగనాథన్ జయంతి వేడుకలు.....
మండల కేంద్రమైన గుడ్లూరులో ఈరోజు గ్రంథాలయ శాస్త్ర పితామహులు డాక్టర్ ఎస్.ఆర్ రంగనాథన్ 132వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి చేసిన సేవలను, దేశంలోనే ఉత్తమ గ్రంథపాలకులుగా అందించిన సేవలను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఆయన జయంతిని గ్రంథపాలకుల దినోత్సవం గా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం గ్రంథాలయంలో ఎస్ ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకొని పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు.. ఈ పుస్తక ప్రదర్శనలో విద్యార్థులు పాల్గొని తమకి ఇష్టమైన కథలు పుస్తకాలను చదువుకొని ఆనందించారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థులతో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు.