పేదలకు కడుపునిండా నాణ్యమైన,పరిశుభ్రమైన ఆహారం.

NavaBharath News Kandukur
0

 



 నవభారత్ న్యూస్ కందుకూరు.

 ఆగస్టు 16 శుక్రవారం రోజున గౌరవ శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి చేతులు మీదుగా కందుకూరులో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభం..

 పేదలకు కడుపునిండా నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం...

 ఐదు రూపాయలకే టిఫిన్, లంచ్, డిన్నర్...

 అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని ఎన్నికలకు ముందు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ 100 రోజుల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని మొదట్లో టార్గెట్...... కానీ అనుకున్న దానికంటే రెండు నెలల ముందుగానే క్యాంటీన్లు ప్రారంభం.

 20 18-19 ఎన్నికల ముందు వరకు 4కోట్ల 60 లక్షల మందికి ఆహారం సరఫరా. 5 రూపాయలు మాత్రమే లబ్ధిదారుల నుంచి వసూలు చేసి మిగిలిన భారమంతా ప్రభుత్వమే భరించింది.

 ఈనెల 15 నుంచి అన్నా క్యాంటీన్లకు ఆహారం సరఫరా టెండర్లను హరే కృష్ణ మూమెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ ఇప్పటికే అక్షయపాత్ర పేరుతో బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తుంది.

 ఆగస్టు 15న కృష్ణా జిల్లా గుడివాడలో క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఆమరసటి రోజు మిగిలిన 99 క్యాంటీన్లను స్థానిక మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారు. మిగిలిన 103 క్యాంటీన్లను సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభిస్తారు. అన్నా క్యాంటీన్ ల కోసం ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు.

 మన కందుకూరు లోని పెద్ద బజార్లో, కూరగాయల మార్కెట్ సెంటర్ లో అన్నా క్యాంటీన్ ను మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి చేతుల మీదగా 16వ తేదీ ప్రారంభమవుతుంది 


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top