నవభారత్ న్యూస్ కందుకూరు.
ఆజాదిక అమృత్ మహోత్సవ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సహకార శాఖ ఆధ్వర్యంలో కందుకూరు స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు, విద్యార్థినులతో సోమవారం కందుకూరులో ర్యాలీ నిర్వహించారు. కందుకూరు సబ్ కలెక్టర్ కుమారి జి.విద్యాధరి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీపోస్ట్ఆఫీస్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగినది.ర్యాలీ దారి పొడవున విద్యార్థులు, విద్యార్థినుల హర్ ఘర్ తిరంగా నినాదంతో దద్దరిల్లినది. విభాగేయ సహకార అధికారి శ్రీ కె రవి చంద్రారెడ్డి, ఉపవిభాగేయ సహకార అధికారి కె.వి సుబ్బారావు, ఇతర సహకార సిబ్బంది, ఉన్నత బాలుర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ నరసింహమూర్తి గారు మరియు వారి సిబ్బంది, డిప్యూటీ తహసీల్దార్లు శ్రీ వి బ్రహ్మయ్య,మరియు కె.లక్ష్మీ ప్రసన్న,రెవెన్యూ శాఖ ఉద్యోగులు, పీడీసీసీ బ్యాంకు సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సిబ్బంది, ఈ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు