నవభారత్ న్యూస్ కందుకూరు.
సాయి నగర్ ఆరో లైన్ లో దొంగను పట్టుకున్న పోలీసులు.....
కందుకూరు కోవూరు రోడ్డు సాయి నగర్ ఆరో లైన్ లో భీమవరపు చెంచయ్య వారి ఇంట్లోకి సుమారు రాత్రి 8 గంటల సమయంలో దొంగ ప్రవేశించారు. దొంగ చప్పుడు విన్నవారు పెద్ద పెద్దగా కేకలు వేశారు. వెంటనే ఆ దొంగ గోడ దూకి పక్కనే ఉన్న చిల్ల చెట్లలోకి జారుకున్నాడు. స్థానికులు పోలీసు వారికి సమాచారం అందజేశారు.. వెంటనే పోలీసు వారు స్థానికులు కలిసి ఆ దొంగను పట్టుకొని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇళ్ల మధ్యలో ఉన్న ఆ చిల్ల చెట్లను తొలగించవలసిందిగా మునిసిపల్ కమిషనర్ను స్థానికులు కోరారు...