నవభారత్ న్యూస్ :
స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాలు..... తేడా తెలుసా!
స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీన జెండా ఎగురవేశారు అంటారు.
జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఆవిష్కరించారు అంటారు.
ఆగస్టు 15వ తేదీన దేశ ప్రధాని ఎర్రకోట మీద జెండా ఎగురవేస్తారు.
జనవరి 26వ తేదీన రాష్ట్రపతి ఎర్రకోట మీద ఆవిష్కరిస్తారు.
స్వాతంత్ర దినోత్సవ నాడు జెండాని స్తంభానికి దిగువ భాగంలో కట్టి పైకి లాగి ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం నాడు స్తంభం పై భాగంలో జెండాను చుట్టి అమర్చి కిందకి ఆవిష్కరిస్తారు. జెండాని పైకి లాగి ఎగురవేస్తే ఒక దేశం ఆవిర్భావానికి చిహ్నంగా పరిగణిస్తారు. అదే పైనుంచి కిందికి ఆవిష్కరిస్తే గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడాన్ని, రాజ్యాంగం పట్ల నిబద్ధత పునరుద్ధరణకు ప్రతికాత్మక సూచనగా భావిస్తారు.