గుర్తింపు ఒకచోట నిర్వహించేది మరోక చోట..

NavaBharath News Kandukur
0


 నవ భారత్ న్యూస్ఒంగోలు.

 గుర్తింపు ఒకచోట తీసుకొని వేరేచోట కాలేజీ నిర్వహిస్తున్న ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి.....

 ప్రకాశం జిల్లా ఒంగోలులోని లాయర్పేట నందుగల ఎస్ ఎస్ఎన్ జూనియర్ కాలేజీ గత కొన్ని సంవత్సరాల నుండి సంబంధిత యాజమాన్యం కాలేజీని నడపకుండా ఇతరులకు మేనేజ్మెంట్ ఇచ్చారు. ప్లీజ్ పూర్తి అయిన పిదప పాత వారే తిరిగి ఈ సంవత్సరం నుండి కాలేజీని నడుపుతున్నారు. వాస్తవంగా చూస్తే ఈ కాలేజీ వివాదాల్లో ఉండడంతో కాలేజీని లాయర్పేట నుండి మంగమూరు రోడ్డులోని డిగ్రీ కాలేజీ కాంపౌండ్ నందు ఏర్పాటు చేశారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కనీసం షిఫ్టింగ్ పర్మిషన్ కూడా తీసుకోకపోవడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజులు చెల్లించక ఖజానాకు గండి కొడుతున్నారు. అంతేకాక ఒకే పరిధిలో రెండు కాలేజీలు పెట్టకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ సంబంధిత ఒంగోలు ఆర్. ఐ.ఓ కాలేజీ పర్మిషన్ కు వెరిఫికేషన్ చేసి ఆమోదించారు. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని మాస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు శివాజీ మంగళవారం నాడు ఒక ప్రకటనలో ఆరోపించారు.

 షిఫ్టింగ్ లేకపోవడమే కాక కాలేజీ నడపడానికి ముఖ్యమైన లీజ్ డి . డి కూడా లేదని అంతేగాక నిబంధనలకు విరుద్ధంగా నాలుగో ఫ్లోర్ నందు రేకుల షెడ్లు వేసి తరగతులు నిర్వహిస్తున్నారని, దీనివలన విద్యార్థులకు భద్రత లేకుండా ఉందని, దీనికి తోడు ఫైర్ సర్టిఫికెట్ కూడా లేదని అనుకోని ప్రమాదాలు జరిగితే విద్యార్థులకు జరిగే నష్టానికి భరోసా ఎవరు అన్నారు. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి బోర్డు నిబంధనల ప్రకారం ఆర్. సి . బిల్డింగ్ లోనే తరగతులు నిర్వహించాలని, ఇంటర్మీడియట్ బోర్డ్ చెబుతున్న వాటిని తుంగలో త్రొక్కి ఆర్. ఐ.ఓ ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇస్తున్నారు. అంటే ఈ కాలేజ్ మీద ఒంగోలు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారికి ఎందుకు ఇంత ప్రేమ అర్థం కావడం లేదని శివాజీ ఆశ్చర్యం వ్యక్తపరిచారు. వెంటనే సదరు కాలేజీని మూసివేసి విద్యార్థులు భవిష్యత్ కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు హెచ్చరించారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top