నవభారత్ న్యూస్ అమరావతి..
స్కిల్ కేసులో మభ్యంతర ఉత్తర్వులు పొడిగింపు!
అమరావతి రాష్ట్ర హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించిన కేసులో నిందితులలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు మద్యంతర ఉత్తర్వులను పొడిగించింది. న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఒక్కల గడ్డ రాధాకృష్ణ కృపా సాగర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అరకు ఎంపీ ఎన్నిక రద్దు చేసే పిటిషన్ విచారణ!
అరకు ఎంపీ తనుజరాని ఎన్నికలు రద్దు చేయాలంటూ సమీప ప్రత్యర్థి కొత్తపల్లి గీత హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశారు. ఆ ఎన్నికల అప్పుడు బిల్లు వాస్తవాలను తనుజరాణి పొందుపరచలేదని అందుకుగాను ఎన్నికను రద్దు చేసి తనను ఎంపీగా ప్రకటించాలని హైకోర్టులో వేసిన పిటిషన్ లో కోరారు. ప్రతివాదులందరకు నోటీసులు జారీ చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి వ్యాజ్యాలను విచారణ!
బెయిల్ మంజూరు చేయాలంటూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తదుపరి విచారణలో ఈ నెల 14 కు వాయిదా వేసింది. రోస్టర్ ప్రకారం తాను విచారించాలా లేక గతంలో విచారించిన న్యాయమూర్తి విచారించాల అనే అంశంపై ఈరోజున నిర్ణయం వెలువరిస్తానని న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపా సాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురజాల కోర్టు ఇప్పటికే బైల్ నిరాకరించిన సంగతి విధితమే.
డిజిటల్ సర్టిఫికెట్లు ఎందుకు ఇస్తున్నారు?రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు!
వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను భౌతిక రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో ఎందుకు ఇస్తున్నారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాక్కులు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేయడం జరిగినది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జై సూర్య ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విధితమే