నవభారత్ న్యూస్ కందుకూరు.
కందుకూరు పట్టణం కోవూరు రోడ్డులో గల అగపే చర్చ నుంచి ఉప్పు చెరువు రోడ్డు లోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం వరకు 26.10 లక్షలతో నిర్మించబోయే డ్రైనేజీ కాలువ నిర్మాణానికి గౌరవ కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి. నాగేశ్వరరావు గారు ముఖ్యఅతిథిగా హాజరై శ్రీ రాజరాజేశ్వరి గుడి దగ్గర శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామా.మల్లేశ్వర రావు,తెలుగుదేశం,బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.