నవభారత్ న్యూస్ కందుకూర్..
ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఘట్టమనేని హరిబాబు
కందుకూరు నియోజకవర్గం 5 మండలాలలో పూర్తిస్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కన్వీనర్ ఘట్టమనేని హరిబాబు నాయకత్వంలో గ్రామ స్థాయి నుండి మండల స్థాయి కందుకూరు మున్సిపాలిటీ వరకు ప్రతి ఒక్క వార్డ్ ప్రజలతో మమేకమై ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ కన్వీనర్ హరిబాబు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబ ప్రజలు పరిస్థితి ని గమనించి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలోనూ ఉపాధి కల్పిస్తారు రోడ్ల కానుండి తాగునీటి వరకు పూర్తి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిది ప్రజలకు నేను ఒక్కటే చెబుతున్న మీరు వేసే ఒక ఓటు మన పిల్లల భవిష్యత్తుకు తొలిమెట్టు కావాలని కోరుకుంటున్నాను మనమందరం కలిసి ఉమ్మడి అభ్యర్థులైన నెల్లూరు పార్లమెంటు ఎంపీగా పోటీ చేయుచున్న అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి. ఇంటూరి నాగేశ్వరరావుని అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తారని ఆశిస్తున్నా