భూసార పరిరక్షణకై రైతులకు అవగాహన

NavaBharath News Kandukur
0

 భూసార పరిరక్షణకై రైతులకు అవగాహన

 

NAVABHARATH NEWS - KANDUKUR

 


 కందుకూరు మండలంలోని కోవూరు, పందలపాడు గ్రామాల రైతు భరోసా కేంద్రాలలో  భూసార పరిరక్షణకై రైతులకు అవగాహన సదస్సును మండల వ్యవసాయాధికారి వి.రాము నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ రైతులందరూ ఖరీఫ్ సీజన్లో ముందు జాగ్రత్తగా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి భూసారాన్ని పెంపొందించాలని సూచించారు. పచ్చిరొట్ట విత్తనాలు అయిన పిల్లిపేసర,జనుము , జీలుగ పైర్లను పూత దశలో భూమిలో కలియదున్నడం వలన భూమిలో కర్బన శాతం వృద్ధి చెంది, స్థూల సూక్ష్మ పోషకాలు లభ్యమయ్యి, నెలలో తేమ శాతం అభివృద్ధి చెంది,భూసారం పెరుగుతుంది అని తెలియజేసారు. వ్యవసాయశాఖ నానో టెక్నాలజీ తో తయారు చేసిన నానో యూరియా ఈ సిజన్ లో అందుబాటులొ వున్నాయని, 500 మి.లీ ఒక బస్తా యూరియా తో సమానమని పంట పై యూరియా కి ప్రత్యామ్నాయంగా పిచికారి చేయవచ్చు అని, ప్రస్తుతం వ్యవసాయశాఖ ద్వారా 50 శాతం రాయితీతో పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులొ వున్నాయని, జనుము పూర్తి ఖరీదు రూ 88/,-,సబ్సిడీ పోను రూ 44/- పిల్లిపెసర పూర్తి ఖరీదు 134/- సబ్సిడీపోను రూ 67/-,  జీలుగ  పూర్తి ఖరీదు రూ 88/-సబ్సిడీ పోను రూ 44/-ఒక కేజీ విత్తనానికి రైతులు చెల్లించాలని అని, కావలసిన రైతులు ముందుగా రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా పేర్లు నమోదు చేసుకొని, డబ్బులు చెల్లించి  పొందవచ్చునని తెలిపారు. కందుకూరు మండలానికి జనుము 151 క్వింటలూ, పిల్లిపెసర  34 క్వింటాళ్ల ,మంజూరు అయ్యాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కోవూరు , పందలపాడు గ్రామ వ్యవసాయ సహాయకులు కె .అభిషిక్త్, జి.రోజి మరియు రెండు గ్రామాల రైతులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top