పాలపిట్ట లాంటి దీర్ఘకావ్యం మన ప్రాంత ప్రముఖ రచయిత ముప్పవరపు కిషోర్ రాయటం గర్వకారణం...పి నాగరజని.

NavaBharath News Kandukur
0
పాలపిట్ట లాంటి దీర్ఘకావ్యం మన ప్రాంత ప్రముఖ రచయిత ముప్పవరపు కిషోర్ రాయటం గర్వకారణం
 
- గ్రంథ పాలకురాలు,పి నాగరజని.

 

NAVABHARATH - KANDUKUR



 కందుకూరు పట్టణంలోని శాఖ గ్రంధాలయంలో ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా బుధవారం కవి రచయిత ముప్పవరపు కిషోర్ రచించిన పాలపిట్ట దీర్ఘకావ్యం పరిచయ సభా కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బుద్ధిష్టు ఉపాసకులు గాండ్ల హరిప్రసాద్ అధ్యక్షత వహించి పాలపిట్ట పుస్తక పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పాలపిట్ట దీర్ఘ కావ్య రచయిత ముప్పవరపు కిషోర్ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యంలో రాస్తున్నటువంటి కావ్యం ఎటువంటి వక్రీకరణ లేకుండా వాస్తవిక దృక్పథంతో రాయాలనే సంకల్పంతో ఎన్నో రాత్రులు నిద్ర మేలుకొని కావ్య రచన పూర్తి చేశానని అందుకు ప్రతిఫలంగా సాహిత్య విమర్శకులు విశ్లేషకులు నుంచి మంచి ప్రశంసలు అందుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. సభాధ్యక్షులు మాట్లాడుతూ కందుకూరు సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక,రాజకీయ నేపథ్యాన్ని సవివరంగా ఈ కావ్యంలో రచయిత పొందుపరచడం జరిగినదని భవిష్యత్తు తరాల వారికి, విద్యార్థులకు ఈ ప్రాంత చరిత్ర తెలుసుకొనుటకు కరదీపికగా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రముఖ అంబేద్కరిస్ట్ గేరా చిరంజీవి మాట్లాడుతూ పాలపిట్ట దీర్ఘకావ్యం మెదడుతో కాకుండా మనసుతో చదివితేనే అర్థం అవుతుందని సామాజిక కోణంలో పాలపిట్ట రచన సాగించిన రచయిత హృదయ భాష మనకి అర్థం కావాలంటే మనం మనసుపెట్టి చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కందుకూరు శాఖా గ్రంధాలయం పాలకురాలు పి నాగ రజని మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా నేటికీ కొనసాగుతున్నాయని విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో వేసవి విజ్ఞాన శిబిరమును నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలు, వకృత పోటీలు, డ్రాయింగ్ పోటీలు, పుస్తక పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా మన ప్రాంత ప్రముఖ కవి రచయిత ముప్పవరపు కిషోర్ రచించిన పాలపిట్ట దీర్ఘ కావ్యమును పరిచయం చేసి విచ్చేసిన పాఠకులకు విద్యార్థులకు అందించడం జరిగినదన్నారు. ఇటువంటి గొప్ప కావ్యం రచించిన కిషోర్ మన ప్రాంత రచయిత కావడం మనందరికీ గర్వకారణం అని ఆమె తెలిపారు. ముందుగా పుస్తకాన్ని ఆవిష్కరించి పాఠకులకు విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ కమిటీ సభ్యులు చిల్లర సుబ్బారావు, సభా కార్యక్రమాన్ని పరిచయం చేయగా లైబ్రరీ కమిటీ సభ్యులైన ఎస్ కే ఖాదర్ భాష, పగడాల రోశయ్య, ఎస్ కే సలోవరు వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top