షోకాజ్ నోటీసులు అందుకోనున్న డాక్టర్స్.
NAVABHARATH - KANDUKUR
కందుకూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు షోకాజ్ నోటీసులను అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు సిద్ధం చేసింది. కందుకూరు పట్టణంలో పేద ప్రజలకు అందుబాటులో వైద్యం అందించాలనే సంకల్పంతో జనార్ధన కాలనీ ఎస్టీ కాలనీ సమీపంలో ఒకటి, ఆదియాంధ్ర కాలనీ సమీపంలో క్లబ్ రోడ్డు నందు ప్రాథమిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగినది. సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో అనేక అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించినప్పటికీ వైద్య సిబ్బంది ముఖ్యంగా డాక్టర్లు సక్రమంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీనివలన వైద్య అవసరాల కోసం విచ్చేసినటువంటి రోగులు అనేక ఇబ్బందులు పాలు అవుతున్నారు. ప్రాథమిక వైద్య కేంద్రంలో ఉన్న సిబ్బంది నర్సులు టెక్నీషియన్సు ఆశా వర్కర్లు సరైన సమాధానం చెప్పట్లేదు అని ప్రజల నుండి ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్లు ఎప్పుడు వస్తారు అన్నదానికి కూడా వారి వద్ద ఎటువంటి సమాచారం ఉండటం లేదు. యదా రాజ తధా ప్రజా అనట్టు డాక్టర్లు వ్యవహరిస్తున్న తీరును బట్టి కింద సిబ్బంది కూడా సక్రమంగా విధులకు హాజరు కావట్లేదు. వీరి ప్రవర్తన వలన రోగులు అనేక ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రాథమిక కేంద్రాలు ఏర్పాటు చేసిన సదుద్దేశం నెరవేరట్లేదని స్థానికులు అభిప్రాడుతున్నారు.