ఇఫ్తార్ దువ్వాలో బుర్రా మధుసూదన్ యాదవ్, కుమారుడు బుర్రా వెంకట సాయి
కందుకూరు .నవభారత్ న్యూస్ ఏప్రిల్ 5
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలంలో జరిగిన ఇఫ్తార్ విందులో బుర్రా మధుసూదన్ యాదవ్, ఆయన కుమారుడు బుర్రా వెంకట సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఇమాములు మౌజాన్లు మత పెద్దలు రంజాన్ మాసంలో ముస్లింలతో పాటు సర్వ మానవాళి కూడా శాంతి సౌభాగ్యాలు కలిగి ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు. అల్లా దయ అందరి పైన ఎల్లప్పుడూ ఉండాలని ఇఫ్తార్ లో దువా చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ ఆకాంక్షించారు. ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్త బోధనలైన ప్రేమ దయ కరుణ అనుసరణీయమని బుర్రా అన్నారు ముస్లింలందరితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మత పెద్దలు, పఠాన్ మైనుద్దీన్, షేక్ మౌలాలి, షేక్ రసూల్, అహ్మద్, బాషా, ఫయాజ్, బదుల్లా, షేక్ షబ్బీర్, ఎస్కే అలీ, సయ్యద్ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.