బోగోలు వైసీపీ కి బీటలు

NavaBharath News Kandukur
0





- టీడీపీలోకి పెరుగుతున్న వలసలు

- భారీ మెజారిటీ సాధిస్తామంటున్న తెలుగు తమ్ముళ్లు
నవభారత్ న్యూస్ తెలుగు. కవలి
బోగోలు వైసీపీ కి బీటలు వారాయి. రోజు రోజుకు తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నాయకులు చేరుతుండటంతో టీడీపీ బలం పుంజుకుంటుంది. బోగోలు మండలం విశ్వనాథరావుపేట కు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు అడపా ప్రసాద్, జొన్నలగడ్డ కోటేశ్వరరావు టీడీపీ లో చేరారు. వీరికి కావలి టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు.. బోగోలు మండలంలో రోజు రోజుకు వైసీపీ దయనీతి స్థితికి చేరుతుండటంతో వైసీపీ నాయకులకు నిద్ర లేకుండా పోతుంది.. భారీ మెజారిటీ సాధిస్తామని మరోవైపు తెలుగు తమ్ముళ్లు మంచి జోష్ లో ఉన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top